. . . బాల్కొండ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్
బతుకమ్మ, మోర్తాడ్
బాల్కొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ప్రశాంత్ రెడ్డి గెలిచి సంవత్సరం అవుతున్నా ప్రోటోకాల్ మర్యాదలు ఇచ్చినా ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనకుండా ప్రభుత్వం ఇచ్చే పథకాలను లబ్ధిదారులకు అందకుండా ఉద్దేశపూర్వకంగా ప్రవర్తిస్తున్నాడని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆరోపించారు. గతంలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న వారి పార్టీ కనీసం రేషన్ కార్డులు, పింఛన్లు ఇవ్వకుండా ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీయించిందని ఇప్పుడు ఈ ప్రజా ప్రభుత్వం ఆర్థికంగా ఎంత కష్టమైనప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని అన్నారు. నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కలిపి 246 కల్యాణ లక్ష్మి చెక్కులు మంజూరయి దాదాపు మూడు నెలలు గడుస్తుందని మరో వారం రోజుల్లో చెక్కుల గడువు తీరిపోతుందని అధికారులు ఎంత విన్నవించినా ప్రశాంత్ రెడ్డి చెక్కులు పంచడానికి రాకుండా ప్రోటోకాల్ ని అగౌరవపరుస్తున్నారని తెలిపారు. గతంలో వారి ప్రభుత్వంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు రావాలంటే సంవత్సరాల తరబడి ఎదురు చూసేవారని ఎప్పుడు ఈ ప్రజా ప్రభుత్వంలో మూడు నెలలకే చెక్కులు మంజూరు చేసిన ప్రశాంత్ రెడ్డి నిర్వాకం వల్ల లబ్ధిదారులకు అందకుండా పోతుందని ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వం తనకిస్తున్న ప్రోటోకాల్ ను అడ్డుపెట్టుకొని ఆపుతున్నారని ఇది దుర్మార్గమైన వ్యవహారమని అన్నారు. ఈ కార్యక్రమంలో కమ్మర్ పల్లి మండల అధ్యక్షుడు సంకేట రవి, మోర్తాడ్ మండల పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు, వేల్పూర్ మండల పార్టీ అధ్యక్షుడు నర్సారెడ్డి, ఎర్గట్ల మండల పార్టీ అధ్యక్షుడు దేవారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రంగు అనిల్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య, జక్క రాజేశ్వర్, అన్ని మండలాల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు,నాయకులు పాల్గొన్నారు.