25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

 డిస్టిబ్యూటరీ కాల్వలను పరిశీలించిన ఎమ్మెల్యే పోచారం

Must read

📰 Generate e-Paper Clip

. . . పంటలు ఎండిపోకుండా ఇరిగేషన్‌ అధికారులు చర్యలు తీసుకోవాలలి

. . . ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

బాన్సువాడ, బతుకమ్మ :

నిజాంసాగర్‌ ఆయకట్టు కింద పంటలు ఎండిపోకుండా ఇరిగేషన్‌ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఆదేశించారు. నిజాంసాగర్‌ డిస్టిబ్యూటరీ 26, 28/1 ఆయకట్టు పరిధిలో పంట పొలాలకు నీరందడంలేదని, పొలాలు ఎండిపోతున్నాయని రైతులు పోచారం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో గురువారం రాత్రి ఆయన ఇరిగేషన్‌ అధికారులను వెంట తీసుకెళ్లి డిస్టిబ్యూటరీ కాల్వలను పరిశీలించారు. డిస్టిబ్యూటరి 26, 28/1 ఆయకట్టు చెరువులు, కుంటలు నింపాలని, కెనాల్‌ లో నీటి లెవల్‌ ౩ ఫీట్లకు తక్కువ కాకుండా ఆయకట్టులోని ప్రతి గుంటకు నీరందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఆగ్రో ఇండస్ట్రీస్‌ చైర్మన్ కాసుల బాలరాజ్‌, నాయకులు, అధికారులు ఉన్నారు.

MLA Pocharam inspected the distributary canals

More articles

Latest article