బతుకమ్మ బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలోని రెడ్డి సంఘంలో బాన్సువాడ, బిర్కూరు, నస్రుల్లాబాద్.. ఈ మూడు మండలాల లబ్ధిదారులకు 1590 నూతన రేషన్ కార్డులను వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు, సబ్ కలెక్టర్ కిరణ్మయి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేషన్ కార్డుల వల్ల అనేక సంక్షేమ పథకాలను ప్రజలు పొందవచ్చని ఆసుపత్రి సేవలు, ఇళ్లులేని వారు ఇందిరమ్మ ఇళ్లు ఇలా అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందగలరని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ధనవంతుల వద్ద రేషన్ కార్డు ఉంటే స్వచ్ఛందంగా అధికారులకు అప్పగించాలని సూచించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా రెవెన్యూ అధికారులు మండలాల వారిగా కౌంటర్ లు పెట్టి రేషన్ కార్డులను లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మెన్ కృష్ణారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధర్, బీర్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం శ్యామల, అంజిరెడ్డి, ఎజాస్, నార్ల సురేష్, అమర్ చావూస్, గౌస్, మూడు మండలాల ప్రజా ప్రతినిధులు, లబ్దిదారులు, రెవిన్యూ, అధికారులు పాల్గొన్నారు.
