25.5 C
Hyderabad

పెండింగ్‌లో ఉన్న బీటీ రోడ్డు పనులపై ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రత్యేక దృష్టి

MLA Madan Mohan places special focus on pending BT road works

Must read

📰 Generate e-Paper Clip

 

. . .  కాంట్రాక్టుల రద్దు, రీ-టెండరింగ్‌కు విజ్ఞప్తి

 

. . . పంచాయతీరాజ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ జగదీశ్వర్ ని కలిసిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

 

ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ మంగళవారం పంచాయతీరాజ్ ఇంజనీర్ ఇన్ చీఫ్  జగదీశ్వర్ ని కలిసి నియోజకవర్గంలో సీఆర్ఆర్, ఎంఆర్ఆర్, నిధుల ద్వారా చేపట్టాల్సిన బీటీ రోడ్ల నిర్మాణ పనులపై సమగ్రంగా చర్చించారు. రోడ్ల నిర్మాణానికి ఇప్పటికే నిధులు మంజూరై, కాంట్రాక్టర్లు అగ్రిమెంట్లు చేసుకుని 4–5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ, ఇప్పటివరకు పనులు ప్రారంభించకపోవడంపై ఎమ్మెల్యే తీవ్రంగా స్పందించారు. ప్రజలకు అవసరమైన రోడ్ల నిర్మాణ పనులను సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉంచడం వల్ల గ్రామీణ ప్రజలు, రైతులు, విద్యార్థులు, ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టికి తీసుకెళ్లారు. నాగిరెడ్డిపేట మండలం  గొల్లిలింగాల, రాఘవపల్లి, ఎర్రారం, ఆత్మకూరు, & బొల్లారం మీదుగా జప్తి జానకంపల్లి రోడ్డు, తాండూర్ నుంచి మసానిపల్లి రోడ్డు, వాడి మీదుగా చినూర్ రోడ్డు పనులు,  సదాశివనగర్ మండలం  ఉత్నూర్ నుంచి తుక్కోజివాడి మీదుగా భూమ్‌పల్లి రోడ్డు, ఎన్ హెచ్-44 నుంచి ధర్మారావుపేట మీదుగా అమర్లబండ రోడ్డు, ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల మీదుగా తిమ్మారెడ్డి రోడ్డు,  గాంధారి మండలం  గాంధారి – చాడ్మల్ తండా మీదుగా పిస్కుల్ గుట్ట తండా – పెద్ద గుజ్జుల్ తండా – చిన్న గుజ్జుల్ తండా – లోంక తండా – దాపు తండా – బీర్మల్ తండా వరకు రోడ్డు పనులతో పాటు పాటు నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో ప్రజలకు ఎంతో అవసరమైన ఇతర ముఖ్యమైన రోడ్ల నిర్మాణ పనులను కూడా త్వరితగతిన చేపట్టాలని ఎమ్మెల్యే కోరారు.

. . . కాంట్రాక్టుల రద్దు చేసి రీ-టెండరింగ్ చేపట్టాలని విజ్ఞప్తి

పనులు ప్రారంభించకుండా సంవత్సరాల తరబడి కాలయాపన చేస్తున్న కాంట్రాక్టర్ల అగ్రిమెంట్లను రద్దు చేసి, వెంటనే రీ-టెండరింగ్ ప్రక్రియ చేపట్టి రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ స్పష్టంగా కోరారు. ప్రజల అవసరాల కోసం మంజూరైన నిధులు సకాలంలో వినియోగంలోకి రావాలని, పెండింగ్‌లో ఉన్న రోడ్డు పనులన్నీ త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఈఎన్ సీకి విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ వినతులపై సానుకూలంగా స్పందించిన ఈఎన్ సీ జగదీశ్వర్,  పెండింగ్ రోడ్డు పనుల అంశాన్ని పరిశీలించి త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.

More articles

Latest article