29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఎల్లారెడ్డి ట్యాంక్‌బండ్ అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

Must read

📰 Generate e-Paper Clip

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

 

ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ ఎమ్మెల్యే మదన్ మోహన్ శనివారం ఉదయం ఎల్లారెడ్డి ట్యాంక్‌బండ్ వద్ద కొనసాగుతున్న అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్, వార్డ్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పనుల పురోగతిపై కాంట్రాక్టర్లు, సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం కొనసాగుతున్న పనులతో పాటు చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు నాణ్యమైన సౌకర్యాలు అందించాలంటే పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని అధికారులకు, కాంట్రాక్టర్లకు స్పష్టం చేశారు. ఎల్లారెడ్డి ట్యాంక్‌బండ్‌ను ప్రజలకు ఆహ్లాదకరమైన విహార ప్రదేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పలు నిర్మాణాత్మక సూచనలు చేసిన ఎమ్మెల్యే, అన్ని పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తూ, ప్రతి పనిని స్వయంగా పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ నాయకత్వంలో ఎల్లారెడ్డి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని స్థానిక నాయకులు పేర్కొన్నారు.

 

MLA inspects Yellareddy Tank Bund development works.

More articles

Latest article