ఎల్లారెడ్డి ట్యాంక్‌బండ్ అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

  ఎల్లారెడ్డి, బతుకమ్మ :   ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ ఎమ్మెల్యే మదన్ మోహన్ శనివారం ఉదయం ఎల్లారెడ్డి ట్యాంక్‌బండ్ వద్ద కొనసాగుతున్న అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్, వార్డ్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పనుల పురోగతిపై కాంట్రాక్టర్లు, సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం కొనసాగుతున్న పనులతో పాటు చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు నాణ్యమైన సౌకర్యాలు అందించాలంటే పనుల నాణ్యత...