నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నిజామాబాద్ నగరంలోని ఖానాపూర్ లోని విఠలేశ్వర్ నగర్ లో నిర్వహిస్తున్న “అఖండ హరినామ సప్తాహ” కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్ పాల్ భక్తులతో కలిసి భజనలు, హరినామ సంకీర్తనలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ భక్తి కార్యక్రమాలు సమాజంలో ఆధ్యాత్మికతను పెంపొందించడంతో పాటు ప్రజల్లో సద్భావన, ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు యువతకు సనాతన ధర్మ విలువలను తెలియజేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న విఠ్ఠలేశ్వర నగర్ పెద్దలు, యువజన మండలి సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని హరినామ సంకీర్తనతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు.ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు, నిర్వాహకులు, భక్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

