29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం 

Must read

📰 Generate e-Paper Clip

 

… ఖురానా ట్రావెల్ బస్సు బోల్తా 

 

…. నలుగురు దుర్మరణం 

 

…. ఏడుగురి పరిస్థితి విషమం

 

… క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు 

 

… డ్రైవర్ నిద్ర మత్తుతో ప్రమాదం

 

 నిజామాబాద్ క్రైo/ ఇందల్వాయి, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 44 పై గురువారం రాత్రి 2 గంటల ప్రాంతంలో అకోలా వెళ్తున్న ఖురానా ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టింది. 22 మందితో ప్రయాణిస్తున్న బస్సు డ్రైవర్ నిద్ర మత్తుతో ఈ ప్రమాదంలో ఘటన స్థలంలో నలుగురు మృతిచెందగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.

Fatal road accident on national highway

 క్షతగాత్రులను హైవే కు సంబంధించిన రెండు అంబులెన్స్ లలో, ఇందల్వాయి కి చెందిన 108 అంబులెన్స్ల లో జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులను మంజూష(32), అబ్బాస్ (35), రుషి (7), మరొకరిని గుర్తించాల్సి ఉంది. గాయపడిన వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు వారిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలిస్తున్నట్టు తెలిసింది.. మృతులు క్షతగాత్రులు మహారాష్ట్ర వాసులని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గురువారం రాత్రి జరిగిన ఈ రోడ్డు ప్రమాదం ఘటనస్థలిలో భయానకంగా ఉంది. ఈ మేరకు ఇందల్వాయి పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Fatal road accident on national highway

More articles

Latest article