. . . నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు
రుద్రూర్, బతుకమ్మ :
రుద్రూర్ మండల కేంద్రంలోని అంబం (ఆర్) గ్రామంలో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ కావడంతో నీరు వృథాగా పోతోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్ కుర్లం గంగాధర్ మాట్లాడుతూ.. గ్రామంలోని ఓ వ్యక్తి పంట పొలాల్లో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ అయ్యి నీరు వృధాగా పోతుందని, 15 రోజులుగా సమస్య కొనసాగుతున్నా అధికారులు స్పందించడం లేదన్నారు. ఈ సమస్య గురించి పలుమార్లు మిషన్ భగీరథ అధికారు లకు విన్నవించిన పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని పేర్కొన్నారు. రైతులు నాట్లు వేసే సమయంలో పొలాల్లోకి నీరు చేరడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, కావున ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి వెంటనే లీకేజీని అరికట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామస్తులు ఉన్నారు.
