23.2 C
Hyderabad

బండి భగీరత్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . బీఆర్ఎస్ నాయకుల డిమాండ్

 

రుద్రూర్, బతుకమ్మ :

 

బండి సంజయ్ కుమారుడు బండి భగీరత్‌ మైనర్ బాలికపై జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. మైనర్ బాలిక పై సంబందించిన ఫోక్సో కేసులో తక్షణమే బండి భగీరత్‌ ను అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం రుద్రూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ తారాబాయి, ఎస్సై సాయన్నకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. బండి సంజయ్  కుమారుడు బండి భగీరత్‌పై మైనర్ బాలికకు సంబంధించిన పోక్సో కేసులో తక్షణమే అరెస్ట్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో బీఆర్ఎస్ పార్టీ మండల ఇంచార్జ్ గాండ్ల మధు, నాయకులు దౌర్ సాయిలు, కొత్తపల్లి రవికిరణ్, సిరిగిరి శేఖర్, కర్రోళ్ల వెంకటేష్, జువ్వల శ్రావణ్, పార్వతి ప్రవీణ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article