25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్రతిరోజూ ‘మైనర్ స్పెషల్ డ్రైవ్’

Must read

📰 Generate e-Paper Clip

. పట్టుబడితే తల్లిదండ్రులకు లేదా వాహన యజమానికి మూడేళ్ల జైలు
. రూ.25వేల జరిమానా
. సీపీ పోతరాజు సాయిచైతన్య ప్రకటన

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: మైనర్ల రోడ్లపై వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని, కమిషనరేట్ పరిధిలో ఇక నుంచి ప్రతి రోజూ ‘మైనర్ స్పెషల్ డ్రైవ్’ నిర్వహించనున్నట్లు సీపీ పోతరాజు సాయిచైతన్య బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

మైనర్లు వాహనాలు నడుతూ పట్టుబడితే పోలీసులే వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి జరినామా వేసేవారని, మైనర్ డ్రైవింగ్ ను అరికట్టేందుకు ఇక నుంచి కఠిన చర్రయలు తప్పవని పేర్కొన్నారు. మైనర్లు వాహనాలు నడపడం కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇకముందు మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే వారి తల్లిదండ్రులకు లేదా వాహన యజమానికి మూడు సంవత్సరాల జైలు శిక్ష, రూ.25వేల జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు.

వాహనం నడుపుతూ పట్టుబడిన మైనర్ తనకు 25 ఏళ్లు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు అర్హుడు కాదని, వాహనం రిజిస్ట్రేషన్ ను సంవత్సరం వరకు రద్దు చేస్తామని స్పష్టం చేశారు.

More articles

Latest article