27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

మంత్రి సీతక్క చేతుల మీదుగా చీరల పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

  • షాపింగ్ కాంప్లెక్స్ 92.80 లక్షల వ్యయంతో పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి సీతక్క
  • మొట్టమొదటిసారిగా కామారెడ్డి జిల్లా నుండి చీరల పంపిణీ

 

బతుకమ్మ, భిక్కనూరు: మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి గురువారం సీతక్క, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ షేట్ కార్ శంకుస్థాపన చేశారు. మార్కెట్ యార్డులో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మంత్రి సీతక్క చేతుల మీదుగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక సామాజిక శ్రేయస్సు కోసం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని ప్రతి మహిళ ఆనందంగా పండుగలను జరుపుకునేందుకు ఇందిరమ్మ చీరల పంపిణీ వంటి కార్యక్రమాలు ఇందిరాగాంధీ స్ఫూర్తితో ప్రతి మహిళ ఉక్క మనిషి మహిళా గా ఎదగాలి అన్నారు. మహిళలు ధైర్యం నాయకత్వం పట్టుదల దేశాభివృద్ధికి కీలకమని ఇందిరాగాంధీ చూపించిన ధైర్య సాహసాలు ఈ తరం మహిళలకు మార్గదర్శకమని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ ఆలీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరాగాంధీ జయంతి పురస్కరించుకొని నవంబర్ 19న కోటిమందికి కోటి చీరల “మహిళ ఉన్నతి తెలంగాణ ప్రగతి” అనే నినాదంతో చీరల పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారని అన్నారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్ వన్ మాట్లాడుతూ జిల్లాలో చీరల పంపిణీ కార్యక్రమాన్ని షెడ్యూల్ ఖరారు చేసి ప్రతి ఇంటికి వెళ్లి బొట్టు పెట్టి చీర సారే అందించడం జరుగుతుందని ఎలాంటి వివాదాలకు తావు లేకుండా నిర్వహించేందుకు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్ డిప్యూటీ ట్రైనింగ్ కలెక్టర్ రవితేజ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు గ్రంధాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి మండల అధ్యక్షుడు భీమ్ రెడ్డి కార్యకర్తలు ఉన్నారు.

Minister Seethakka distributes sarees

Minister Seethakka distributes sarees

More articles

Latest article