- మేం ధాన్యం దించుకోం..
బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు మండలంలో ఇప్పటికే నత్త నడకన సాగుతున్న ధాన్యం కొనుగోలుపై మరో పిడుగు పడనున్నది. ధాన్యాన్ని దించుకునేందుకు రైస్ మిల్లు యాజమాన్యాలు దొడ్డు వడ్లు తీసుకోవడానికి ససే మీరా అంటున్నారు. రైతులు మాత్రం రోడ్లపైనే నిరీక్షిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు నిలిచిపోవడం అనేక ప్రాంతాలలో ధాన్యాన్ని సేకరణ కేంద్రాలు పని చేయడం లేదని దానికి కారణం లారీలు ఖాళీ కాకపోవడం ప్రభుత్వం కొనుగోలు చేసినప్పటికీ రైస్ మిల్లు యాజమాన్యాలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. సంబంధిత అధికారులు జోక్యం చేసుకొని ధాన్యాన్ని తొందరగా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
