బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం లో నిర్వహించిన ప్రజా వాణి కార్యక్రమం లో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో శాశ్వత ప్రాతిపదికన ఎమ్ హెచ్ ఓ పోస్ట్ భర్తీ చేయాలని ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు పుట్ట వరదయ్య మాట్లాడుతూ ఎమ్ హెచ్ ఓ పోస్టు గత ఐదు సంవత్సరాలుగా ఇంచార్జీ తో కోనసాగిస్తున్నారని దీనివల్ల మున్సిపల్ కార్మికులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. మున్సిపల్ కార్మికులు అనారోగ్యం కు గురైతే ఇఎస్ఐ సౌకర్యం పోందలేక పోతున్నారన్నారు. నిజామాబాద్ నగరంలో అనేక రెస్టారెంట్ లు, హోటల్ లు పెద్ద ఎత్తున ఉన్నాయని తెలిపారు. వాటిలో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని తనిఖీ ల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ప్రజల ఆరోగ్యం గాలిలో దీపం లా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. వానకాలం సీజన్ లో అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నాయని వాటి నిరోధానికి తగిన చర్యలు తీసుకోవడంలో మున్సిపల్ యంత్రాంగం విఫలం అవుతుందని పేర్కొన్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో శాశ్వత ప్రాతిపదికన ఎమ్ హెచ్ ఓ పోస్ట్ భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శివ రాజు, జిల్లా నాయకులు సురేష్, గంగాధర్ పాల్గొన్నారు.
