29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

సుంకేట్ పాఠశాలకు డెస్కులు బహుకరణ

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్,బతుకమ్మ: సమాజ సేవకు నిలువెత్తు నిదర్శనం పాఠశాల పిల్లలపై మక్కువతో ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న నానుడికి రూపాన్ని ఇచ్చిన చిట్టాపూర్ వాస్తవ్యులు మానవత్వానికి ప్రతిరూపంగా ఏనుగుల దయానంద్ రెడ్డి నిలిచారు. మోర్తాడ్ మండలంలోని సుంకేట్ పాఠశాలకు సుమారు లక్ష ఇరవై ఐదు వేల రూపాయల తో విద్యార్థులకు 25 డేస్కులను ప్రధానం చేశారు. దీంతో విద్యార్థులు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు పెద్ది సంతోష్ కుమార్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయ బృందం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article