నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బడి బాటలో భాగంగా ఈనెల 17న మంగళవారం ప్రభుత్వం అందించిన ఒక జత ఏకరూప దుస్తులను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కోటగల్లి విద్యార్థులకు నిజామాబాద్ సౌత్ మండల విద్యాశాఖ అధికారి సాయి రెడ్డి అందజేశారు. 196మంది విద్యార్థిని విద్యార్థులకు ఒకటవ తరగతి నుండి ఐదో తరగతి వరకు ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ డిప్యూటీ కృష్ణారావు, కాంప్లెక్స్ హెడ్మాస్టర్ మల్లేశం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామచందర్ గైక్వాడ్, ఉపాధ్యాయులు దయానంద్, ప్రసన్నలక్ష్మి, సవిత, మమత, సౌందర్య, ముకుంద్, సంతోష్, నందిని, విద్యార్థులు పాల్గొన్నారు.
