28.2 C
Hyderabad

సఖీ సెంటర్ ను సందర్శించిన సీపీ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయిచైతన్య మంగళవారం నగరంలోని సఖీ సెంటర్ ను సందర్శించారు. ఈ సందర్భంగా సఖీ సెంటర్ లో ఉన్న బాధిత మహిళలతో మాట్లాడారు. గృహహింస, చీటింగ్ కేసు బాధితులతో మాట్లాడారు. 181 కాల్స్ డాష్ బోర్డ్, మిషన్ శక్తి డాష్ బోర్టును చెక్ చేశారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. భాధిత మహిళలకు అన్ని రకాల సేవలని సకాలంలో అందిస్తున్నారని సిబ్బందిని  ప్రశంసించారు. సఖి సెంటర్, భరోసా, ఐసీపీఎస్ అన్ని ఒకే దగ్గర ఉంటే బాగుంటాయని సూచించారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ రసూల్ బీ, సుదం లక్ష్మి, స్నేహ సొసైటీ అండ్ సఖి సెక్రటరీ సిద్దయ్య, సఖి సెంటర్ అడ్మనిస్ట్రేటర్ భానుప్రియ,  డీసీపీఓ చైతన్య, సఖి సిబ్బంది పాల్గొన్నారు.

CP visits Sakhi Center

More articles

Latest article