బతుకమ్మ, ఏర్గట్ల : మండల కేంద్రంలోని రైతు వేదికలో గ్రామపంచాయతీల సాధారణ ఎన్నికలలో భాగంగా రిటర్నింగ్ అధికారులతో, జోనల్ అధికారులతో, పంచాయతీ కార్యదర్శి, కారోబార్లతో, ఆర్మూర్ (డిఎల్పిఓ) ఏర్గట్ల మండల ప్రత్యేక అధికారి శివకృష్ణ ఏర్గట్ల మండల కార్యాలయంలోసమావేశం నిర్వహించారు. సర్పంచ్ నామినేషన్ ల స్వీకరణ, పరిశీలన, తుది అభ్యర్థుల నిర్దారణ లాంటి కీలక విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోని ఎలాంటి అవాంతరాలు లేకుండా ఎన్నికలు మొత్తం ప్రశాంతంగా నిర్వహించాలని మండల పరిధిలోని గ్రామ పంచాయితీ కార్యదర్శులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ మల్లయ్య, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఎంపీ ఓ,శివశరణ్, పాల్గొన్నారు.
