28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

కుక్క కాటుకు మందులు లేవ్

Must read

📰 Generate e-Paper Clip

  •  ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మందుల కొరత
  •  జిల్లా కలెక్టర్ ఆదేశాలు బేఖాతార్

రుద్రూర్,  బతుకమ్మ: రుద్రూర్ మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మందుల కొరత ఉందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. రుద్రూర్ గ్రామానికి చెందిన ఓ మహిళకు కుక్క కరవడంతో, చికిత్స కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లగా, ఇక్కడ కుక్క కాటుకు మందులు లేవని, వర్ని, బోధన్ అయినా వెళ్ళండి అని ఆసుపత్రి సిబ్బంది తిరిగి వెనక్కి పంపించారు. అక్టోబర్ 25 వ తేదీన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రిలో మందుల కొరత లేకుండా చూడాలని, రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి వైద్యులకు, సిబ్బందికి ఆదేశించారు. గ్రామాల్లో కుక్కల బెడద తీవ్రంగా ఉండడంతో, చాలామంది ప్రజలు కుక్క కాటుకు గురవుతున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలను బెఖాతార్ చేస్తూ, స్థానిక ఆసుపత్రిలో కుక్కకాటుకు మందు లేకపోవడంతో, ఇతర గ్రామాలకు వెళ్లి వైద్య చికిత్సలు చేయించుకోవాల్సిన వస్తుందని, దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా వెంటనే అధికారులు స్పందించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇందుల కొరత లేకుండా చూడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

More articles

Latest article