28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మోర్తాడ్: రైతులు నిబంధనలకు లోబడి వరి ధాన్యాన్ని తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని మోర్తాడు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముత్యాల రాములు అన్నారు. మోర్తాడ్ మండలంలోని ధోన్ పాల్ గ్రామంలో బుధవారం వరి కొనుగోలు కేంద్రం ను ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అన్ని విధాలుగా కృషి చేస్తుందని పేర్కొన్నారు. రైతుల తరఫున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీసీసీబీ డైరెక్టర్ మోత్కు భూమన్న, సొసైటీ చైర్మన్ అశోక్ రెడ్డి, డైరెక్టర్లు ముత్యాల లక్ష్మణ్, భూమన్న, మాజీ రైతుబంధు అధ్యక్షుడు దేవన్న, మాజీ సర్పంచ్ దేవన్న, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం రవి, ఉపసర్పంచ్ రమేష్, వీడీసీ అధ్యక్షుడు ముత్యం, రైతుబంధు గ్రామ అధ్యక్షుడు పర్స గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article