పిట్లం, బతుకమ్మ : మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెద్ద రాంపూర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు శ్రీలత కాంప్లెక్స్ పరిది లోని కుర్తి, గౌరారం ప్రాథమికోన్నత పాఠశాలలను గురువారం సందర్శించారు. టీచర్ల అటెండెన్స్ రిజిస్టర్లను, పరీక్షల విభాగం , మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. పాఠశాలకు వెళ్లని విద్యార్థులను గుర్తించి వారితోపాటు తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. కార్యక్రమంలో హెచ్ఎంలు రవీందర్, శంకర్, ఆ యా పాఠశాలల సిబ్బంది నాగరాణి, శ్యామ్ గౌడ్, విఠల్, కృష్ణా రెడ్డి, ధనుంజయ్, ఎల్లయ్య , సంధ్య, ఆ ప్రాంత క్లస్టర్ రిసోర్స్ పర్సన్ గోపాల్ ఠాకూర్ తది తరులు పాల్గొన్నారు.
