
కామారెడ్డి, బతుకమ్మ: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రాంలీలా మైదానంలో నిర్వహిస్తున్న రైతు ధర్నాలో పాల్గొనేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కామారెడ్డి జిల్లా రాజాంపేట మండలం పొందుర్తి చౌరస్తా వద్ద ఆ పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎంకే ముజీబొద్దీన్ తోపాటు నాయకులు కేటీఆర్ ను కలిశారు. ఆదిలాబాద్ లో నిర్వహిస్తున్న రైతు ధర్నాలో పాల్గొనేందుకు భారీ ఎత్తున కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల నుంచి తరలివెళ్లారు.
