మాతా శిశు మరణాలను అరికట్టాలి
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డి, బతుకమ్మ : మాతా శిశు మరణాలను అరికట్టాలని, క్షేత్ర సిబ్బంది ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మాతా శిశు మరణాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇప్పటివరకు జరిగిన మాతా శిశు మరణాలు నివారించగలిగినవి ఉన్నప్పటికినీ క్షేత్రస్థాయి సిబ్బంది అవగాహన రాహిత్యం వలన సంభవించాయనీ తెలిపారు. ఇకముందు జరిగే మాతా శిశు మరణాలకు సంబంధించిన నివేదికలను ఏ రోజు కారోజు జిల్లా...