. . . 8 మంది ఆర్టిఓ ల కి స్థాన చలనం
. . . 94 మంది ఎంవిఐలు…90 మంది ఎఎంవిఐల ట్రాన్స్ ఫర్
హైదరాబాద్, బతుకమ్మ:
తెలంగాణలో రవాణా శాఖలో భారీగా బదిలీలు చెపట్టింది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖలో ప్రక్షాళన పేరుతో పెద్ద ఎత్తున రీజినల్ ట్రాన్స్ పోర్ట్ అఫిసర్ లు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ లను బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు రవాణా శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు 8 మంది ఆర్ టి ఓ,94 మంది ఎంవిఐలు, 90 మంది ఎఎంవిఐలు లను బదిలీ చేశారు. రాష్ట్రంలో బదిలీలపై నిషేధం ఎత్తివేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న అధికారులను బదిలీ చేశారు. ఉద్యోగులను పోకల్ టు నాన్ పోకల్, యూనిట్ టు యూనిట్ లుగా బదిలీ చేయడం గమనార్హం.
