. . . సూపారి ఇచ్చి చోరీ చేసిన పాత నేరస్తుడు
. . . ఆర్మూర్ చోరీ కేసును చేదించిన పోలీసులు
నిజామాబాద్ క్రైం , బతుకమ్మ:
ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి కాలనీలో మే 24న జరిగిన భారీ చోరీ కేసును వారం రోజుల్లోనే చేదించి, ముగ్గురిని అరెస్టు చేసినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. సోమవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో సీపీ మాట్లాడుతూ…. ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి నగర్ కాలనీకి చెందిన మార్వాడి వ్యాపారీ కుటుంబ సమేతంగా వేములవాడ దేవస్థానం కు ఇంటికి తాళం వేసి వెళ్లారు. గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడి రూ.41 లక్షల విలువైన బంగారం, వెండితో పాటు నగదు చోరీ చేయగా బాధితుడి ఫిర్యాదు మేరకు ఆర్మూర్ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. చోరి కేసు వేదనకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయగా సోమవారం ఆర్మూర్ పట్టణంలోని బ్రాహ్మణ పల్లి చౌరస్తాలో ముగ్గురు వ్యక్తులు అనుమానస్పదంగా బ్యాగ్ తో సంచరిస్తుండగా పట్టుకోవడంతో ఈ కేసు కొలిక్కి వచ్చింది.
ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి నగర్ కు చెందిన విజయ్ అగర్వాల్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. అతనికి నేర చరిత్ర ఉంది. దాదాపు ఏడు కేసులు నమోదు అయ్యాయి. విజయ్ అగర్వాల్ తన బాబాయ్ ఇంట్లో చోరి కి పథకం రచించాడు. విజయ్ అగర్వాల్ తనకు పరిచయం ఉన్న హైదరాబాద్ బంజారాహిల్స్ నంది నగర్ కు చెందిన సల్మాన్ ఖాన్ అలియాస్ కలీం లల్లా తో పాటు అదే ప్రాంతంలో వేంకటేశ్వ కాలనీకి చెందిన ముంజల్ సాయి కుమార్, శ్రీ హరి అనే వ్యక్తి ద్వారా తన బాబాయ్ ఇంటిలో చోరికి ప్లాన్ వేశారు. అందుకు గాను ముగ్గురికి కొన్ని డబ్బులు ఇచ్చి చోరి చేయాలని దోచుకున్న సొమ్ము పంచుకోవాలని పథకం రచించాడు. మే 24న తన బాబాయ్ ఇంటికి తాళం వేసి వెళ్లగా ముగ్గురి ద్వారా రూ.41 లక్షల విలువైన బంగారం, వెండితో పాటు నగదు చోరీ చేశారు. అందులో శ్రీహరి 8 లక్షలు నగదు తీసుకుని పరారీలో ఉండగా మిగిలిన 31 లక్షల విలువైన బంగారం, వెండితో పాటు 19 లక్షల నగదును సీజ్ చేసి విజయ్ అగర్వాల్, సల్మాన్ ఖాన్, ముంజల్ సాయి కుమార్ లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. కేసును వారం రోజుల్లో చేదించిన ఆర్మూర్ ఎసిపి వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ, సీసీఎస్ సీఐ సాయినాథ్ వారి టీంలను సిపి సాయి చైతన్య అభినంధించారు. బాబాయ్ ఇంట్లో చోరీకి పాల్పడిన అబ్బాయ్ విజయ్ అగర్వాల్ పై 7 కేసులు ఉండటంతో అతడిపై రౌడీషీట్ ఓపెన్ చేసినట్లు సిపి సాయి చైతన్య తెలిపారు.
