25.3 C
Hyderabad

యజమానిని కట్టేసి  భారీ చోరీ

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ : ఇంటి యజమానిపై దాడికి పాల్పడి కట్టేసి ఇంట్లో నేపాల్ ముఠా  భారీ చోరీ చేసిన ఘటన నగరంలోని కార్ఖానా పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గన్ రాక్ ఎన్ క్లేవ్ లో కెప్టెన్ గిరి (75) అనే వ్యక్తి ఇంట్లో పని చేసే నేపాల్ కు చెందిన వ్యక్తి మరో నలుగురితో కలిసి దోపిడీ చేశాడు. వారు ఇంటి యజమాని గిరిపై కర్రలతో దాడి చేసి అతడిని కట్టేసి ఇంట్లో 25 తులాలకు పైగా బంగారం, రూ.23 లక్షల నగదును చోరీ చేశారు. మొత్తంగా రూ. 50లక్షల విలువైన బంగారు నగలతో పాటు నగదును ఎత్తుకెళ్లినట్లు  బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

 

More articles

Latest article