27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

సీఎం రేవంత్​రెడ్డి దిష్టిబొమ్మ దహనం

Must read

📰 Generate e-Paper Clip

బాన్సువాడ, బతుకమ్మ  : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు కోణాల గంగారెడ్డి మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆపరేషన్ సిందూర్, దేశ సైనికులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు సిగ్గుచేటన్నారు.రేవంత్ రెడ్డి వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు చీదర్ సాయిలు, జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్, లక్ష్మీనారాయణ, గుడుగుట్ల శ్రీనివాస్, ఉమేష్, గజ్జల మహేష్, సిద్ది బాలరాజ్, చీకట రాజు, కొండని గంగారాం, పాశం భాస్కర్ రెడ్డి, శ్రీకాంత్, నాగరాజ్, ప్రణయ్ సాయి రెడ్డి పాల్గొన్నారు.

More articles

Latest article