ఎల్లారెడ్డి, బతుకమ్మ : లింగంపేట మండలం లింగంపేట్ సొసైటీ చైర్మన్ దేవేందర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సంగమేశ్వర్, కొయ్య గుడ్డు తండా మాజి సర్పంచ్ రాందాస్ నాయక్ ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గత పాలకులు 20 సంవత్సరాలుగా చెయ్యని అభివృద్ధి మదన్ మోహన్ ఎమ్మెల్యే అయిన 18 నెలలో చేసి చూపించారని తెలిపారు. 3500 ఇందిరమ్మ ఇల్లు మంజురు చేశారని తెలిపారు. గతంలో ఎన్నడు లేని విధంగా 50 కోట్ల నిధులతో గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణించారని పేర్కొన్నారు. ప్రతి ఒక్క గ్రామంలో బోర్లు వేసి త్రాగు నీటి సమస్య ను తీర్చారన్నారు. ముఖ్యంగా లింగంపేట మండలంలో భూ భారతి చట్టం పైలెట్ ప్రాజెక్ట్ తీసుకుని వచ్చి రైతుల భూ సమస్యలు తీరుస్తున్నారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులు కుడా మదన్ మోహన్ కృషితో ముందుకు సాగుతున్నాయన్నారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై బిఆర్ఎస్, బీజేపీ పార్టీలకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ లో చేరామని అన్నారు. ఈ కార్యక్రమాలో ex జెడ్పిటి సంతోష్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఫీయొద్దీన్ పార్టీ నాయకులు తుమ్మలపల్లి శ్రీనివాస్ రెడ్డి ex ఎంపీటీసీ ఎదుల్ పార్టీ సీనియర్ నాయకులు గోకుల్ సాయిరాం, సురాయిపల్లి సర్పంచ్ రాజశేఖర్ రెడ్డి, పోల్కంపేట్ సర్పంచ్ నాగరాజు పాల్గొన్నారు.
