27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఉచిత పాఠ్యపుస్తకాలు పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ,  బతుకమ్మ : జీపీఎస్ ఖిల్లా  ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉచిత నోట్‌బుక్స్, స్కూల్‌బ్యాగులు, పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, జియోమెట్రీ బాక్సులు, పండ్ల పంపిణీ, అలాగే ప్రభుత్వ బ్రహ్మపురి, బర్కత్‌పురా పాఠశాలలో పసందైన భోజనం, స్వీట్లు పంపిణీ చేసినట్లు పీఆర్టీయూ తెలంగాణ జిల్లా అధ్యక్షులు కృపాల్ సింగ్ తెలిపారు. ఉపాధ్యాయుడిగా విద్యార్థులకు పాఠాలు చెబుతూ, సమాజ సేవలో భాగమై రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పీఆర్టీయూ తెలంగాణ జిల్లా అధ్యక్షులు కృపాల్ సింగ్ తను చిన్నప్పుడు చదువుకున్న పాఠశాలను ఎంపిక చేసుకుని ప్రస్తుతం పాఠశాలలో చదువుతున్న చిన్నారుల మధ్య ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. జన్మదినం పురస్కరించుకొని విద్యార్థులకు నోట్‌బుక్స్, స్కూల్‌బ్యాగులు, పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, జియోమెట్రీ బాక్సులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కృపాల్ సింగ్ మాట్లాడుతూ చదువుతో చిన్నారుల భవిష్యత్తు గొప్పగా ఉంటుందని అన్నారు. నిత్య సాధన చేయాలని డబ్బు అనుభూతిని మాత్రమే ఇస్తుందని కానీ పేదరికం అనుభవాన్ని, విద్యని ఇస్తుందని తెలిపారు. పిల్లలు చదువుతోపాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు. అనంతం ప్రభుత్వ బ్రహ్మపురి, ప్రభుత్వ బర్కత్‌పురా పాఠశాలలో విద్యార్థులకు భోజనం పెట్టీ ఆటపాటలతో బహుమతులు అందజేశారు.

More articles

Latest article