బతుకమ్మ,బాల్కొండ: మహారాష్ట్రలోని బీల్కొని గ్రామం బిలోలి తాలూకా నాందేడ్ జిల్లా కి చెందిన జంగా శివకళ (30) వ్యవసాయ కూలీ. గత సంవత్సరన్నర నుండి బ్రతుకుతెరువు కోసం తన భర్తతో కలిసి వన్నెల్ బి గ్రామంలో ఉంటున్నారు. వ్యవసాయ కూలీలుగా పని చేసుకుంటూ జీవిస్తున్నారు. శివకళ భర్త రాజు గంగారం కొంతకాలంగా మద్యానికి బానిసై రోజు తాగుతూ, శశికళతో గొడవ పడుతూ ఉండేవాడు. అదేవిధంగా గత రాత్రి శనివారం రాజు గంగారం తన భార్య శివకళను ఏదో పదునైన ఆయుధంతో తలపై కొట్టి ఆమెను చంపి ఎక్కడో పారిపోయాడు. మృతురాలు తల్లి లింగం పిరాజీ రాధాబాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాల్కొండ ఎస్సైబి.నరేష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆర్మూర్ రూరల్ సీఐ కే శ్రీధర్ రెడ్డి, ఆర్మూర్ ఎసిపి వెంకటేశ్వర రెడ్డి, బాల్కొండ ఎస్సై బి నరేష్ లు సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహం ను ఆర్మూర్ గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు.