30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

ఛత్తీస్ ఘడ్ లో మావోయిస్టులకు ఎదురు దెబ్బ

Must read

📰 Generate e-Paper Clip

  • మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు గౌతం ఎన్ కౌంటర్
  • పీపుల్స్ వార్ చర్చల ప్రతినిధి గా పాల్గొన్న సుధాకర్ మృతి

 

వెబ్ డెస్క్, బతుకమ్మ:  మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ సభ్యుడు గౌతం అలియాస్ సుధాకర్ ఎన్ కౌంటర్ లో మరణించినట్టు చత్తీస్ గడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా పోలీసులు అధికారికంగా ప్రకటించారు. నేషనల్ పార్క్ ఫారెస్ట్  లో గౌతమ్ అలియాస్ సుధాకర్ తో పాటు ఇతర మావోయిస్టులు సంచరిస్తున్నారని డిఆర్ జి, ఎస్ టిఎఫ్ బలగాలు కుంబింగ్ నిర్వహిస్తుండగా ఎదురుకాల్పులు జరుగడంతో సుధాకర్ మరిణించినట్లు తెలిపారు. ఆంద్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరానికి చెందిన నరసింహచలం 40 సంవత్సరాల క్రితం  అప్పటి పిపుల్స్ వార్ లో చేరి అంచలంచెలుగా ఎదిగారు. దండకారణ్యంలో జనతన సర్కార్ లో విద్యా వ్యవస్థను పర్యవేక్షించిన సుధాకర్ ఆయుర్వేద వైద్య విద్యను అభ్యసించి నక్సల్ గా మారినట్లు సమాచారం. గత నెల 21న మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటి కార్యదర్శి సంబళ్ల కేశవరావు అలియాస్ బసవరాజ్ ఎన్ కౌంటర్ తో మావోయిస్టు పార్టీ సూప్రిం కమాండర్ ను కోల్పోయింది. 2004 లో ఉమ్మడి అంద్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వంతో పీపుల్స్ వార్, జనశక్తి పార్టీలు శాంతి చర్చలు జరిపిన విషయం తెలిసిందే. శాంతిచర్చలకు పీపుల్స్ వార్ పార్టీ తరుపున పాల్గొన్న ప్రతినిధులలో గౌతమ్ అలియాస్ సుధాకర్ ఒకరు.

More articles

Latest article