ఎన్ కౌంటర్ లో మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు అడెల్లు మృతి

ఛత్తీస్ ఘడ్, బతుకమ్మ : ఛతీస్ ఘడ్ లోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ మృతి చెందారు. 24గంటల్లో రెండోసారి ఎదరు కాల్పులు జరగడంతో దండకారణ్యంలో ఉద్రక్తత చోటుచేసుకుంది. మావోయిస్టు అగ్రనేతలే లక్ష్యంగా బలగాలు సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో కేంద్ర కమిటీ సభ్యుడు, శాంతి చర్చల ప్రతినిధి అలియాస్ గౌతం అలియాస్ సుధాకర్ గురువారం మరణించగా,...