కామారెడ్డి డిఎస్పీ నాగేశ్వర రావు
కామారెడ్డి, బతుకమ్మ: మంత్రాలు అనేవి అభూత కల్పనలని కామారెడ్డి డీఎస్పీ నాగేశ్వరరావు అన్నారు. కామారెడ్డి ఎస్పీ సింధూశర్మ ఆదేశాల మేరకు దేవునిపల్లి పిఎస్ పరిధిలోని అడ్లూరు గ్రామంలో మూఢనమ్మకాలపై విజ్ఞాన దర్శిని, కళాబృందం పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో గురువారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అడ్లూర్ గ్రామంలో మంత్రాల నెపంతో దాడి జరిగిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా విజ్ఞాన దర్శని వాళ్ళు కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఎస్పీ నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మూఢనమ్మకాలనేది ఒక అబూత కల్పన అని, ప్రతీది కూడా సైన్స్ తో ముడిపడి ఉందని అన్నారు. దీంట్లో ఎలాంటి నిజాలు లేవని, వీటిని నమ్మకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి రూరల్ దేవనపల్లి ఎస్సై రాజు, మాచారెడ్డి ఎస్సైఅనిల్, రామారెడ్డి ఎస్ఐ నరేష్, పోలీస్ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

