బీబీపేట్, బతుకమ్మ :
కామారెడ్డి జిల్లా బీబీపేట్ పోలీస్ స్టేషన్‌కు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై నవీన్ చంద్రను బీబీపేట్ మండల ప్రెస్ క్లబ్ ప్రతినిధులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎల్లమైన శ్రీకాంత్, ఉపాధ్యక్షుడు దేవునిపల్లి తిరుపతి, కార్యదర్శి ఏంబరి ఈ. శ్రీనివాస్, కోశాధికారి కారంపూరి వేణు, కార్యవర్గ సభ్యులు కొరవి నరసింహులు, కొమ్మురాజు తదితరులు ఎస్సైకు శుభాకాంక్షలు తెలియజేసి, పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్సై నవీన్ చంద్ర మాట్లాడుతూ, మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజల సహకారం ఎంతో అవసరమని అన్నారు. ప్రజలు పోలీసులకు అన్ని విషయాల్లో సహకరిస్తే చట్టం, శాంతిభద్రతల పరిరక్షణలో మరింత సమర్థవంతంగా పనిచేయగలమని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని, ప్రజల భద్రతకు ఎల్లప్పుడూ పోలీసు శాఖ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమావేశం స్నేహపూర్వక వాతావరణంలో కొనసాగగా, పోలీసు-ప్రజల మధ్య సమన్వయం మరింత బలోపేతం కావాలని ప్రెస్ క్లబ్ ప్రతినిధులు ఆకాంక్షించారు.
