నూతన ఎస్సై ని కలిసిన మండల ప్రెస్ క్లబ్ ప్రతినిధులు
బీబీపేట్, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా బీబీపేట్ పోలీస్ స్టేషన్‌కు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై నవీన్ చంద్రను బీబీపేట్ మండల ప్రెస్ క్లబ్ ప్రతినిధులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎల్లమైన శ్రీకాంత్, ఉపాధ్యక్షుడు దేవునిపల్లి తిరుపతి, కార్యదర్శి ఏంబరి ఈ. శ్రీనివాస్, కోశాధికారి కారంపూరి వేణు, కార్యవర్గ సభ్యులు కొరవి నరసింహులు, కొమ్మురాజు తదితరులు ఎస్సైకు శుభాకాంక్షలు తెలియజేసి, పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్సై నవీన్ చంద్ర మాట్లాడుతూ, మండలంలో...