30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

పార్కింగ్ కు అడ్డాగా మండల సమీకృత కార్యాలయం

Must read

📰 Generate e-Paper Clip

  • ఇష్టానుసారంగా ద్విచక్ర వాహనాల పార్కింగ్

 

రుద్రూర్, బతుకమ్మ : మండల కేంద్రంలోని సమీకృత మండల సముదాయ కార్యాలయం పార్కింగ్ లకు అడ్డాగా మారాయి. కార్యాలయానికి లోపలికి వెళ్లే దారిని కూడా ద్విచక్ర వాహనాలతో అడ్డదిడ్డంగా పార్కింగ్‌  చేయడంతో కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. కార్యాలయ స్థలం ఖాళీగా ఉన్న కూడా కార్యాలయం ఎదుటనే ద్విచక్ర వాహనాలను ఎక్కడపడితే అక్కడ ఇష్టానుసారంగా పార్కింగ్ చేస్తున్నారని, ఇప్పటికైనా అధికారులు స్పందించి కార్యాలయం ఎదుట వాహనాలను పార్కింగ్ చేయకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

More articles

Latest article