మాక్లూర్, బతుకమ్మ : మాక్లూర్ మండలంలోని మానిక్ బండర్ చెందిన కేతవత్ బాలు మద్యం తాగి వాహనం నడిపిన సమయంలో స్థానిక మాక్లూర్ పోలీస్ మే 28వ తారీకు పట్టుకొని కేసు నమోదు చేశారు. స్పెషల్ సెకండ్ క్లాస్ జడ్జ్ నూర్జహాన్ ప్రవేశపెట్టగా రెండు రోజుల జైలు విధించినట్లు మాక్లూర్ ఎస్సై రాజశేఖర్ తెలిపారు. మద్యం తాగి ఎవరు వాహనాలు నడపొద్దు అలాగే మైనర్లకు వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని, లైసెన్స్ పొందిన తర్వాతనే వాహనాలు నడపాలని హెచ్చరించారు.
