30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

అగ్ని ప్రమాదాల నివారణ పై అవగాహన

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో ఏఎస్ఐ రేణుక ఆధ్వర్యంలో శనివారం అగ్ని ప్రమాదాల నివారణ పై ప్రజలకు అవగాహన కల్పించారు. అగ్నిప్రమాద సంఘటనలు, భవనాలు కూలినప్పుడు, కెమికల్స్‌ లీకేజీ అయినప్పుడు, వరదలు వచ్చినప్పుడు అనుసరించాల్సిన పద్ధతులు, మెళకువలపై అవగాహన కల్పించి, డెమో ద్వారా ప్రత్యక్షంగా చూపించారు. మంటలు అధికంగా ఉన్నట్లయితే అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article