24 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్రమాదవశత్తు చెరువులో పడి వ్యక్తి మృతి

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

ప్రమాదవశాత్తు చెరువులో పడి ఒకరు మృతి చెందిన ఘటన రుద్రూర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. రుద్రూర్ ఎస్సై సాయన్న తెలిపిన వివరాల ప్రకారం.. రుద్రూర్ గ్రామానికి కేంద్రానికి చెందిన అక్కపల్లి గంగాధర్ (54) ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. మృతుడు అక్కపల్లి గంగాధర్ గురువారం రాత్రి గ్రామ శివారులోని చెరువు వద్దకు కాలకృత్యాల కొరకు వెళ్లగా కాలుజారి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతుని భార్య అక్కపల్లి శోభ ఇచ్చిన ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయన్న వెల్లడించారు.

More articles

Latest article