ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి పట్టణంలోని ఇనందర్ గల్లిలో నివసించే రేష్మ అనే మహిళ తన భర్త నజీమ్ తరచుగా మద్యం సేవించి వేధిస్తుండడంతో సోమవారం రాత్రి డయల్–100కు కాల్ చేసింది. సమాచారం అందుకున్న వెంటనే పెట్రోల్ కార్ సిబ్బందిలోని కానిస్టేబుల్ కే.సాయికిరణ్ ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితిని అర్థం చేసుకొని నజీమ్‌ను శాంతింపజేయడానికి ప్రయత్నించారు. నజీమ్ ఆగ్రహంతో విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా, ఇంట్లో ఉన్న కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన కానిస్టేబుల్ దాడి నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఎల్లారెడ్డి పోలీసులు నిందితుణ్ణి అదుపులోకి తీసుకుని, మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. విధుల్లో ఉన్న పోలీసులపై ఎవరైనా దురుసుగా ప్రవర్తించినా, దాడికి యత్నించినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎల్లారెడ్డి పోలీసులు హెచ్చరించారు.
