25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

14న రాష్ట్ర బందును విజయవంతం చేయండి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో వెనుకబడిన వర్గాల తరగతులకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం.9పై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని నిరసిస్తూ, ఈనెల 14న తలపెట్టిన రాష్ట్ర బందును జయప్రదం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కెంపుల నాగరాజు పిలునిచ్చారు.  అఖిలపక్ష రాజకీయ పార్టీలు,  బీసీ కులసంఘాలు, ప్రైవేట్ విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రజాస్వామ్య పద్ధతిలో, శాంతియుత వాతావరణంలో బందు పాటించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి బీసీలకు జరిగిన అన్యాయాన్ని తీసుకెళ్లాలని సూచించారు. జనాభా దామాషా పద్ధతిలో 56శాతం రిజర్వేషన్స్ బీసీలకు ఇవ్వాల్సిందేనని డిమాండ్  చేశారు. 56శాతం రిజర్వేషన్లు తమ హక్కని, నోటికాడి ముద్ద లాక్కుంటే, సహించబోమని హెచ్చరించారు. తాము ఎవరికి వ్యతిరేకం కాదని, తమ జోలికి వస్తే ఊరుకోమని, అన్ని లెక్కలు తీస్తామని పేర్కొన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం 50శాతం రిజర్వేషన్స్ మించరాదని ఉన్నప్పుడు, 10శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఇచ్చి, 60శాతం ఎలా చేశారని కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇది సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించడం కదానాని, 50శాతం జనరల్  కోటా నుంచి 10శాతం తొలగించి, ఈడబ్ల్యూఎస్ కోటా కల్పించినప్పుడు ఆ పది శాతం కోటా ఎస్సీ, ఎస్టీ , బీసీలు కోల్పోయినట్టు కదా, ఇది ఈ సామాజిక వర్గాలకు నష్టం చేసినట్టు కదా అన్నారు.  ఈడబ్ల్యూఎస్ లకు కేటాయించిన పది శాతంలో బీసీ, ఎస్సీ,ఎస్టీల వాటా ఎందుకు లేదని ప్రశ్నించారు. ఎస్సీ , ఎస్టీ, బీసీలు ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారు కదానని, వారు వైట్ రేషన్ కార్డుదారులు కాదనని బహుజన సమాజం ప్రశ్నిస్తుందని తెలిపారు. 10శాతం జనరల్ కోటా నష్టపోయిన తమకు ఈడబ్ల్యూఏస్ కోటాలో అవకాశం కల్పించాల్సిందేనని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వంద వైఖరి సరికాదని హితవు పలికారు.

More articles

Latest article