14న రాష్ట్ర బందును విజయవంతం చేయండి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో వెనుకబడిన వర్గాల తరగతులకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం.9పై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని నిరసిస్తూ, ఈనెల 14న తలపెట్టిన రాష్ట్ర బందును జయప్రదం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కెంపుల నాగరాజు పిలునిచ్చారు. అఖిలపక్ష రాజకీయ పార్టీలు, బీసీ కులసంఘాలు, ప్రైవేట్ విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రజాస్వామ్య పద్ధతిలో, శాంతియుత వాతావరణంలో బందు పాటించాలని, కేంద్ర, రాష్ట్ర...