సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను విజయవంతం చేయండి

0 1,636

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :  బంజారాల ఆరాధ్యుడు సేవా లాల్ మహారాజ్ జయంతి వేడుకలను విజయవంతం చేయాలని నిర్వహణ కమిటీ పిలుపునిచ్చింది. తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ కళాశాల సెమినార్ లో శనివారం నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో జయంతి వేడుకలను తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఘనంగా చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జయంతి రోజును అందరికీ వర్తించేలా సెలవు దినంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. అటు యూనివర్సిటీలో చేపట్టే సేవాలాల్ జయంతిని విద్యార్థులంతా కులమతాలకు అతీతంగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రొఫెసర్ శాంతదేవి, కిరణ్ రాథోడ్, ప్రవీణ్ కుమార్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయిలు, బికోజి, రవీందర్, బబ్లు, దిలీప్, అశోక్ విద్యార్థి నాయకులు, సాగర్ నాయక్, లక్ష్మణ్, శ్రీకాంత్, మోహన్, పృద్వి, రాజు, శేఖర్,రాము,సంజు,శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.