26.2 C
Hyderabad
Monday, August 3, 2026

విద్యాశాఖ స్థలాన్ని జిల్లా కోర్టుకు కేటాయించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • హైకోర్టు న్యాయమూర్తులకు బార్ అసోసియేషన్ వినతి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కోర్టు ఆవరణానికి ఆనుకుని ఉన్న పూర్వ విద్యాశాఖ స్థలాన్ని జిల్లా కోర్టుకు కేటాయించాలని హైకోర్టు న్యాయమూర్తులు అలిశెట్టి లక్మి నారాయణ, జె.శ్రీనివాసరావు లకు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ వినతిపత్రం అందజేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టుల నూతన భవనాల శంకుస్థాపన కార్యక్రమానికి శనివారం హాజరైన న్యాయమూర్తులను కలిసి మాట్లాడారు. పెరిగిన కోర్టుల సంఖ్య,దానికి అనుగుణంగా న్యాయవాదుల,కోర్టుసిబ్బంది కక్షిదారుల వాహనాలు పెరిగి పోవడం వలన జిల్లాకోర్టు ఆవరణ ఇరుకిరుగా మారిపోయి ఇబ్బందులు ఎదుర్కోంటున్నారని తెలిపారు. మహిళలపై అత్యాచారాల, హింసను విచారించే ప్రత్యేక న్యాయస్థానం, అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు,నిజామాబాద్ ఐదవ అదనపు జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు,నిజామాబాద్ ప్రత్యేక పొక్సో కోర్టు జడ్జిల పోస్ట్ లు ఖాళీగా ఉన్న నేపథ్యంలో వాటిని భర్తీ చేయాలని విన్నవించారు. వినతిపత్రాలు స్వీకరించిన హైకోర్టు న్యాయమూర్థులు సానుకూలంగా స్పందించి నట్లు జగన్ తెలియజేశారు. కార్యక్రమంలో బార్ కౌన్సిల్ సభ్యుడు రాజేందర్ రెడ్డి, బార్ కోశాధికారి ఎ.దీపక్, న్యాయవాది ఆరేటి నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Education department should allocate space to district court

More articles

Latest article