సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను విజయవంతం చేయండి

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :  బంజారాల ఆరాధ్యుడు సేవా లాల్ మహారాజ్ జయంతి వేడుకలను విజయవంతం చేయాలని నిర్వహణ కమిటీ పిలుపునిచ్చింది. తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ కళాశాల సెమినార్ లో శనివారం నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో జయంతి వేడుకలను తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఘనంగా చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జయంతి రోజును అందరికీ వర్తించేలా సెలవు దినంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. అటు యూనివర్సిటీలో చేపట్టే సేవాలాల్ జయంతిని...