ఫిబ్రవరి 12 న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి
. . . తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ పిలుపు
నిజామాబాద్ అర్మన్, బతుకమ్మ :
నిజామాబాదులో కామ్రేడ్ వనమాల కృష్ణ అధ్యక్షతన, తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ సమావేశం శ్రామిక నగర్, కోటగల్లీలో జరిగింది. ఈ సమావేశంలో టి యు సి ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ సూర్యం, తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి మిద్దె నరేందర్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పాత కార్మిక చట్టాలను రద్దుచేసి నూతనంగా తెచ్చిన లేబర్ కోడు రద్దు చేయాలన్నారు. కార్మికులందరికీ మినిమం పెన్షన్ గా నెలకు 9000 రూపాయలు ఇవ్వాలని తదితర డిమాండ్లతో ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో బీడీ కార్మికులు చురుకుగా పాల్గొనాలన్నారు. జీవన భృతి రానీ కార్మికులందరికీ జీవన భృతి ఇవ్వాలని, ఇప్పటికే జీవనభృతిని పొందబోయే కార్మికులందరికీ 4000 రూపాయలుగా పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కే రాజన్న, రాష్ట్ర సహాయ కార్యదర్శులు ఏం ముత్తన్న, ఏం వెంకటి, బక్కన్న, రామ లక్ష్మణ్, డి రాజేశ్వర్, వి సత్తమ్మ తదితరులు పాల్గొన్నారు.