5న రైతు సదస్సును విజయవంతం చేయండి
చెరుకు ఉత్పత్తిదారుల సంఘం కన్వినర్ ఆకుల పాపయ్య నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: ఎన్సీఎస్ఎఫ్ సారంగాపూర్ చక్కెర ఫ్యాక్టరీని ప్రభుత్వం తెరిపించి నడిపించాలని డిమాండ్ తో ఈనెల 5న నిర్వహించే రైతు సదస్సును విజయవంతం చేయాలని చెరుకు ఉత్పత్తిదారుల సంఘం కన్వినర్ ఆకుల పాపయ్య పిలుపునిచ్చారు. నగరంలోని ఆర్య నగర్ లో గల చెరుకు నాయకులు పోచారం సంతోష్ నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడినారు. ఈ సదస్సును జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్ మున్నూరు కాపు కళ్యాణ మండపంలో చెరుకు...