26.2 C
Hyderabad
Monday, August 3, 2026

23న ఛలో హైదరాబాద్ ధర్నాను విజయవంతం చేయండి

Must read

📰 Generate e-Paper Clip

  • ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నేతలు

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 23న ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుయస్పిసీ) ఆధ్వర్యంలో హైదరాబాద్ ధర్నా చౌక్ లో మహాధర్నా నిర్వహిస్తున్నట్లు యుయస్పిసి రాష్ట్ర స్టీరింగ్‌ కమిటీ నాయకులు వై.విజయ్ కుమార్, పి.శంతన్ ప్రకటించారు. జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటైన యుయస్‌పిసి స్టీరింగ్‌ కమిటి సమావేశంలో  నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడిచినప్పటికి ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో తీవ్రమైన జాప్యాన్ని ప్రదర్శిస్తుందన్నారు. మేనిఫెస్టోలో పొందుపరచిన ఎన్నికల హామీలను అమలు పరచడం లేదన్నారు. నూతన జిల్లాలకు డిఈఓ పోస్టులను, ప్రతి రెవెన్యూ డివిజన్‌కు డిప్యూటీ ఈఓ, నూతన మండలాలకు యంఈఓ పోస్టులను మంజూరు చేసి, ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్‌ను రూపొందించి, ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. ఉపాధ్యాయుల పెన్షనర్ల, వివిధ రకాల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక పాఠశాలలకు 5571 పియస్‌ హెచ్‌యం పోస్టులను మంజూరు చేయాలని, డిఎడ్‌, బిఎడ్‌ అర్హతలున్న ప్రతి యస్‌జిటికి పియస్‌హెచ్‌యం ప్రమోషన్‌కు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.  పండిట్, పిఈటిల అప్ గ్రేడేషన్ ప్రక్రియ పూర్తి అయినందున జిఒ 2,3,9,10 లను రద్దు చేసి జిఒ 11,12 ల ప్రకారం పదోన్నతులు కల్పించాలని, ఉపాధ్యాయుల సర్దుబాటు మార్గదర్శకాలను సవరించాలని, సిపిఎస్ పెన్షన్ స్కీమ్ రద్దుచేసి పాత పెన్షన్స్ స్కీమ్ అమలుపరచాలని, పిఆర్సి గడువు ముగిసి రెండేళ్లయిన ఇంకా రిపోర్టు తెప్పించుకోలేదని వెంటనే రిపోర్ట్ తెప్పించుకొని 2023 జూలై నుండి నలభై శాతం పిట్మెంటుతో పిఆర్సి అమలు చేయాలని,317 జీవో బాధితులకు న్యాయం చేయాలని,398 వేతనంతో పనిచేసిన స్పెషల్ టీచర్లకు ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్న ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని,వివిధ జిల్లాల్లో జరిగిన పైరవీ డిప్యూటేషన్లను వెంటనే రద్దు చేయాలని, గురుకుల టైం టేబుల్ సవరించాలని, కెజిబివి, మోడల్‌ స్కూల్స్‌, గిరిజన సంక్షేమ, ఎయిడెడ్ టీచర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి అనేక మార్లు ప్రాతినిధ్యం చేసినప్పటికి మంత్రులు, ఆఫీసర్ల కమిటీలు వేసినా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో గత నెలలో దశలవారీ ఉద్యమ కార్యాచరణ చేపట్టాలని యుయస్‌పిసి నిర్ణయించిందన్నారు. జులై 23, 24,  తేదీలలో మండల తహసీల్దార్ల ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి కి మెమోరాండాలు సమర్పించామని, రెండవ దశలో ఆగస్టు 5న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించి జిల్లా కలెక్టర్ ద్వారా వినతిపత్రాలు అందజేశామని అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు. అనివార్యంగా  ఆగస్టు 23న హైదరాబాద్‌లో ఇందిరా పార్క్ వద్ద రాష్ట్ర స్థాయి మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ చూపి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. పోస్టర్ ఆవిష్కరణ జిల్లా స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు నిర్వహించడం జరిగింది. ఈఆవిష్కరణలో జిల్లా స్టీరింగ్ కమిటీ నాయకులు ఓ. రమేష్, వెనిగళ్ళ సురేష్, సీహెచ్.సుధాం రాసరి పెంటన్న, జి.గంగాధర్, రాజారాo, నగేష్, శేఖర్, ఎస్. గంగాధర్, పోషణ, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Make the Chalo Hyderabad Dharna on the 23rd a success.

More articles

Latest article