32.2 C
Hyderabad

పూర్వ విద్యార్థుల మహా సమ్మేళనం విజయవంతం చేయండి

Must read

📰 Generate e-Paper Clip

  • శ్రీ సరస్వతీ శిశు మందిర్ లో డిసెంబర్ 29 న మహా సమ్మేళనం
  • కర పత్రాల ఆవిష్కరించిన పూర్వ విద్యార్థి పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు హరిష్మరన్ రెడ్డి

ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూరు పట్టణ కేంద్రం లోని టీచర్స్ కాలని లో గల శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో డిసెంబర్ నెల 29 ఆదివారం రోజున పూర్వ విద్యార్థుల మహా సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పూర్వ విద్యార్థి పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు హరిష్మరన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రారంభం 1981 నుండి 2024 వరకు 43 వ వసంతోత్సవం లో భాగంగా పాఠశాలలో చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థినీవిద్యార్థులు  ఈ  యొక్క మహాసమ్మేళన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పూర్వ విద్యార్థులు పాఠశాల అభివృద్ధికి సహాయపడుతూ సమాజ సేవలో ముందు ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రవినాథ్ , ఇంధూర్ విభాగ్  శైక్షనిక్ ప్రముఖ్ పక్కి శ్రీనివాస్ , కర్థన్ శ్రీనివాస్ , పాఠశాల ప్రబంధ కారిణి  అధ్యక్షుడు వంశీకృష్ణ , ప్రసన్నకుమార్ , రజనీకాంత్ , వర్షిత్ ,బొమ్మేన ప్రశాంత్ ,పాఠశాల ప్రిన్సిపల్ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article