29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

తెలంగాణకు మహారాష్ట్ర ధాన్యం

Must read

📰 Generate e-Paper Clip

  • చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం
  • బోగస్ బోనస్ కోసమే ధాన్యం తెప్పిస్తున్నారని ఆరోపణలు
  • గత సీజన్ లో బోధన్ డివిజన్ లో బోగస్ బోనస్ ప్రకంపణలు
  • నేటికి తేలని విచారణ.. బాధ్యులపై చర్యలు శూన్యం

 

నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణకు మహారాష్ట్ర నుంచి ధాన్యం అక్రమ రవాణా షూరు అయింది. గురువారం రాత్రి నాందేడ్ జిల్లా నుంచి నిజామాబాద్ జిల్లాలోని వర్ని మండలానికి చెందిన ఒక రైతు పేరిట తరలుతున్న లారీ నిండా వడ్ల (ధాన్యం) ను పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు సాధారణ తనిఖీలలో అవి పట్టుబడటంతో మహారాష్ట్ర నుంచి రవాణా అవుతున్న ధాన్యం గుట్టు రట్టైంది.

తెలంగాణ లో ధాన్యం సేకరణ (కొనుగోలు)ను ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన తరువాత ధాన్యంకు మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తున్న విషయం తెలిసిందే. గత సీజన్ లో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. రైతులకు క్వింటాళ్ కు రూ.500 బోనస్ ను మద్దతు ధరకు కొనుగోలు నేపథ్యంలో దానిని సొమ్ము చేసుకునేందుకు కొందరు మహారాష్ట్ర సరిహద్ధు ప్రాంతాల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి తెలంగాణకు తరలిస్తున్నారు. నిజామాబాద్ ఉమ్మడి జల్లాలో ప్రవహించే గోదావరి, మంజీరా, హరిద్రా నదులకు అవల మరాఠా ప్రజలు వరిని సాగు చేస్తున్నారు. అక్కడ ధాన్యం పండించిన వాటిని నిజామాబాద్ జిల్లాలోను పండిస్తారు. అయితే మద్దతు ధర, బోనస్ వ్యవహారం పక్కదారి పట్టకుండా ఉండేందుకు నిజామాబాద్, కామారెడ్డి జల్లాలో మహారాష్ట్రతో ఉన్న సరిహద్ధులలో జుక్కల్, మద్నూర్, పోతంగల్, సాలూరా, కందకుర్తి వద్ద నిఘా పెడుతుంది. కాని ప్రస్తుతం సీజన్ ప్రారంభమైన పౌరసరఫరాల శాఖ ఆదిశగా చర్యలు తీసుకోలేదు. దానితో మహారాష్ట్ర నుంచి యథేచ్ఛగా ధాన్యంను కొనుగోలు చేసి స్థానికంగా రైతుల పేరిట కొనుగోలు కేంద్రాల ద్వారా అమ్మకం చేసి మద్దతు ధరను కొట్టేసే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతుంది.

నిజామాబాద్ జిల్లా బోదన్ సబ్ డివిజన్ కు మహారాష్ట్ర ధాన్యం రవాణా జరుగుతుంది. గత సీజన్ లో కోటగిరి మండలంలో 650 మంది రైతుల ద్వారా జరిగిన ధాన్యం సేకరణలో బోగస్ బోనస్ వ్యవహారం బట్టబయలైంది. 3 లక్షలకు పైగా బోనస్ వచ్చిన వారు దాదాపు 50 మంది రైతుల ఖాతాలపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. సంబంధిత రైతులు తమ కౌలుదారుల ద్వారా మిల్లర్లకు, ప్యాడి క్యాన్వసీంగ్ ఏజెంట్లకు అమ్ముకున్నారు. దానితో వారే మహారాష్ట్ర దాన్యంను తెప్పించి తమ పేర్ల మీద సొసైటీల ద్వారా, కొనుగోలు కేంద్రాలలో నమోదు చేసుకుని బోనస్ ను కొట్టేశారని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఈ విషయంపై విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. కాని ఇప్పటికి విచారణ పూర్తి కాలేదు. కనీసం బాధ్యులను గుర్తించడం లేదు. వారిపై చర్యలు తీసుకున్న దాఖాలాలు లేవు. దానితో బోగస్ బోనస్ ను ఈ సీజన్ లో దక్కించుకునేందుకు వడ్ల వ్యాపారులు, మిల్లర్లు, కొందరు బడా లీడర్లు పథకం వేశారని ప్రచారం జరుగుతుంది. వర్నికి చెందిన రైతు పేరిట రవాణా అవుతున్న ధాన్యం లారీ పోలీసులకు చిక్కగా దానిపై సమగ్ర విచారణ జరిగితే అవినీతి బాగోతం బట్టబయలవుతుంది.

 

More articles

Latest article